HNK: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్వీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో హన్మకొండ కేయూ విద్యార్థి నాయకులను గురువారం అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రజాపాలన కాదని, నిర్బంధ పాలన అని విమర్శిస్తూ ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, విద్యా గ్యారెంటీ కార్డు, స్కూటీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
బీఆర్ఎస్వీ నేతల ముందస్తు అరెస్టు


