హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీరాపురంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

GDWL: గద్వాల మండలం వీరాపురంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని ఇవాళ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు వెంకటేష్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అని, త్వరలో గ్రామంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నీలం నారాయణ, వెంకట్‌రెడ్డి, గొల్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.