హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన నేతను ఎమ్మెల్యే పరామర్శ

కృష్ణా: జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావును అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ పరామర్శించారు. ఇటీవల వేణుగోపాల్ తీవ్ర అస్వస్థతకు గురై విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. గురువారం ఆయనను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.