హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

BDK: సుజాతనగర్‌లో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వీర్ల రమేశ్, బీఆర్‌ఎస్ నాయకులు చింతలపూడి జగన్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు.