హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరుమడ్లలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం

NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ రజక సంఘం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ధైర్యంగా నిలబడి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ మహిళా శక్తికి నిదర్శనం అన్నారు.