హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామచంద్రపురం మాజీ మున్సిపల్ ఛైర్మన్ మృతి

కోనసీమ: రామచంద్రపురం మాజీ మున్సిపల్ ఛైర్మన్, వైసీపీ నాయకుడు దువ్వూరి గోపాలకృష్ణ(79) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన గతంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా, 6 నెలలు ఇంఛార్జి ఛైర్మన్‌గా పనిచేశారు. గాయత్రి బ్రాహ్మణ సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన మృతి పై మాజీ ఎంపీ పిల్లి బోస్, వైసీపీ నాయకులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.