హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగు పద్ధతులపై రైతులకు అవగాహన

కృష్ణా: గూడూరు మండల వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కంచకోడూరు గ్రామంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంట నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ AO శివరామకృష్ణ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. శాస్త్రీయ పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.