హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పోలీసుల కీలక సూచనలు

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీసులు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు, అదనపు బస్సుల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఆర్టీసీ, ట్రాఫిక్ విభాగాల్లో సమన్వయంతో విధులు నిర్వహించాలని, వచ్చే భక్తులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు.