GNTR: ఉమ్మడి గుంటూరు జడ్పీ పాలకవర్గ గడువు ఈ నెల 24తో ముగియనుండటంతో, 22 లేదా 23వ తేదీల్లో చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్ హెనీక్రిస్టినా అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ నెల 25న బాపట్ల, పల్నాడు నూతన జడ్పీలు ఆవిర్భవించనున్న నేపథ్యంలో, ఈ సమావేశంలో ప్రస్తుత పాలకవర్గానికి వీడ్కోలు పలకనున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు జడ్పీ చివరి సమావేశానికి ఏర్పాట్లు


