హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గేదె అడ్డురావడంతో యువకుడికి ప్రమాదం'

ASR: గొర్రెలమెట్ట గ్రామానికి చెందిన సీందేరి కన్సు ఇవాళ జడ్డంగి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అకస్మాత్తుగా గేదె అడ్డుగా రావడంతో దానిని తప్పించబోయి బైక్ అదుపుతప్పి కిందపడినట్లు తెలిపారు. ఈ ఘటనలో అతని కాలుకు తీవ్ర గాయమైంది. హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు.