హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల ఐసీడీఎస్ పీడీగా సువర్ణ

బాపట్ల జిల్లా మహిళా శిశు అభివృద్ధి, సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఎస్.సువర్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆమె, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం శాఖా అధికారులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు. కాగా, ఇక్కడ పీడీగా పనిచేసిన రాధా మాధవి బదిలీ అయ్యారు.