కోనసీమ: అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వలకు బుధవారం 50 కిలోల భారీ టూనా చేప చిక్కింది. ఇంత పెద్ద చేప చిక్కడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చేపను చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. దీనిని హార్బర్‌కు తరలించగా వేలంలో స్థానికులు రూ.12 వేలకు కొనుగోలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారుల వలకు చిక్కిన 50 కిలోల టూనా చేప


