హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారం

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని కోమాల్ల చెరువు కట్ట చుట్టుపక్కల రైతుల సమస్యకు పరిష్కారం లభించింది. వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిధులు మంజూరు చేశారు. దీంతో నేడు పనులు చేపట్టగా..స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.