హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు-వికారాబాద్ మధ్య ప్రత్యేక రైలు

GNTR: వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గుంటూరు-వికారాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 నుంచి ప్రత్యేక రైలు (నెంబరు 07227) నడుస్తుందన్నారు. గుంటూరు నుంచి రాత్రి 9.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉ. 5 గంటలకు VKBకు చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.