NDL: డోన్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ మద్దిలేటి అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. కొంతకాలంగా నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందగా.. పోలీసు సిబ్బంది, దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డోన్‌లో ఏఎస్ఐ మృతి


