KMR: పిట్లం మండలంలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. బ్రాహ్మణపల్లి శివారులో దూడపై రాత్రి చిరుత దాడి చేసినట్లు సమాచారం. అన్నారం గ్రామానికి చెందిన దూడను చిరుతపులి చంపినట్లు స్థానికులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పిట్లంలో చిరుత కలకలం.!


