హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వెలిగొండ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ'

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన కలనూతల, చింతలముడిపి గ్రామాల నిర్వాసితులకు సెప్టెంబర్ 11వ తేదీన ఇండ్ల పట్టాలు నిత్యవసర సరుకులు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. మార్కాపురం కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.