హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ

ADB: ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో కంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ గురువారం తెలిపారు. అర్హులైన వైద్యులు ఈ నెల 15న రిమ్స్ కార్యాలయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు rimsadilabad.org ను సందర్శించాలని సూచించారు.