హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాశీనగర్‌లో ఆర్టీసీ బస్సుల కోసం నిరసన

JN: బచ్చన్నపేట మండలంలోని కాశీనగర్ గ్రామంలో స్థానిక మహిళలు ఈ రోజు ఉదయం నిరసన తెలిపారు. తమ గ్రామంలో RTC బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై వెళ్తున్న బస్సులు అడ్డుకుని నిరసన వ్యక్తంచేశారు. HYD నుంచి బచ్చన్నపేటకు, బచ్చన్నపేట నుంచి HYDకు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు పోచన్నపేట తర్వాత ఉన్న కాశీనగర్ గ్రామంలో ఆపడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.