హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిత్యావసరాల ధరలకు రెక్కలు..!

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో బియ్యం, పప్పులు, నూనె, పంచదారతో పాటు కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగింది. ధరల పెరుగుదలపై ఇటీవల వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, హిందూపురం పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటిలో నిరసన చేపట్టారు. ధరలను నియంత్రించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.