NRPT: పాఠశాల సమయానికి బస్సులు రావడంలేదని, సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉదయం మక్తల్ మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పాఠశాల సమయానికి బస్సు రాకపోవడంతో నిత్యం పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు మంత్రి శ్రీహరి స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు.
తెలంగాణ
బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు


