హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రవరం జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం

ASR: జీకే వీధి మండలం ఆర్‌.వి.నగర్‌ సమీపంలోని ఎర్రవరం ప్రధాన రహదారి జంక్షన్‌ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌, జీపు ఢీకొన్న ఘటనలో తండ్రితో కలిసి ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తరలించారు. జీపులో ప్రయాణిస్తున్న కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.