హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

సత్యసాయి: జిల్లా, మండల ప్రజాపరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల జాబితాను ఈ నెల 19లోగా విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నెల 11న ఓటరు జాబితాలు ప్రదర్శిస్తారు. 14న పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితా సిద్ధం చేసి 15న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 18న కలెక్టర్ ఆమోదానికి పంపి, 19న తుది జాబితా ప్రదర్శిస్తారు.