హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న విష్ణు వర్ధన్ రెడ్డి

HNK: పట్టణంలోని దీన్ దయాళ్ నగర్‌లో నిర్వహించిన ఆషాఢ బోనాల ఉత్సవాలకు కాంగ్రెస్ యువజన నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకలని అన్నారు. ప్రజల సుఖసంతోషాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించారు.