హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో యలవర్తి నాయుడమ్మ జయంతి వేడుకలు

GNTR: ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ జయంతిని గురువారం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. చెంచుపేటలో ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయుడమ్మ స్మారక అవార్డు ప్రధానోత్సవం సాయంత్రం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగనుంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నాయుడమ్మ అవార్డును గల్లా రామచంద్ర నాయుడు అందుకోనున్నారు.