హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: షాకిచ్చిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరిగి రూ.1,55,510గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 పెరిగి రూ.1,42,550 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలవుతున్నాయి.