హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీఎం దంపతులకు టీడీపీ నేత బహుమతి

NTR: చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక బహుమతిని అందజేస్తున్నట్లు TDP నేత దర్శత్ పొట్లూరి తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ఓ కళాకారుడితో ఏటికొప్పాక చెక్కతో ప్రత్యేకంగా ఈ హస్తకళను తయారు చేయించినట్లు చెప్పారు. సుమారు 20 రోజుల పాటు కళాకారుడు శ్రమించి రూపొందించిన ఈ కళాకృతిని చంద్రబాబు దంపతులకు అందజేయనున్నట్లు చెప్పారు.