హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్మీ టాకీస్ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని లక్ష్మి టాకీస్ సమీపంలోని గన్ని రాజు కాలనీలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. కరెంట్ స్తంభానికి ఉన్న పిచ్చి మొక్కలకు నిప్పు అంటుకుని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే అప్రమత్తమైన మంటలను అదుపు చేశారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు