హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జగదాంబ సెంటర్లో గవ్వల గణేశ్..

విశాఖ జగదాంబ సెంటర్‌లో పర్యావరణ హితానికి పెద్దపీట వేస్తూ వినూత్న వినాయక విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. సముద్రం నుంచి సేకరించిన సుమారు 6 వేల సహజ గవ్వలతో 15 అడుగుల ఎత్తైన గణేశ్ విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఎలాంటి కాలుష్యానికి తావులేకుండా ప్రకృతి సిద్ధ పదార్థాలతో నిర్మిస్తున్న ఈ విగ్రహం ప్రస్తుతం తయారీ దశలోనే నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది.