హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

విశాఖ నాలుగో టౌన్ పోలీస్టేషన్ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున 1 గంట సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక కూర్చున్న పెంటిబోయిన సన్యాసిరావు (34) అదుపుతప్పి కిందపడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో భుజం, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.