ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని సమతానగర్‌లో గురువారం చెట్ల పొదలలో ఒక మగ శిశువుని గుర్తించారు. శిశు ఏడుపు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మగ శిశువుని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా శిశు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మగ శిశువుని రక్షించిన పోలీసులు


