KNR: అక్రమ అరెస్టులతో విద్యార్థి నాయకుల గొంతు నొక్కలేరని BRSV జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు తనను గృహనిర్బంధం చేసి కొత్తపల్లి ఠాణాకు తరలించారని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం BRSV నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని, ఈ నియంత పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
తెలంగాణ
'అక్రమ అరెస్టులతో BRSV స్వరాన్ని నొక్కలేరు'


