హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నత్తనడకన కల్వర్టు నిర్మాణం.. వాహనదారులు ఇబ్బందులు

తూ.గో: రాజమండ్రి రూరల్ హుకుంపేట వీరభద్ర నగర్ వద్ద కల్వర్టు నిర్మాణం పూర్తికాక పోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాడితోట సెంటర్ నుంచి తూర్పు రైల్వే స్టేషన్ మీదుగా ఈ మార్గం బొమ్మూరు హైవేను కలుస్తుంది. దీంతో ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.