హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కలకు చర్మవ్యాధి.. ప్రజల్లో ఆందోళన

SDPT: హుస్నాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో కుక్కలకు తీవ్రమైన చర్మవ్యాధి సోకి శరీరం దెబ్బతినడంతో పాటు, దుర్వాసన వస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధి ఇతర కుక్కలకు వ్యాపించే అవకాశం ఉండటంతో  ప్రజారోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందేమోనని కాలనీవాసులు భయపడుతున్నారు. మున్సిపల్, పశువైద్య శాఖ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.