హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల వివాదంపై పవన్ కళ్యాణ్ సీరియస్

కాకినాడ: ఈనెల 4 వ తేదీన పిఠాపురం పాదగయ క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాలు సందర్భంగా చీరల పంపిణీ వద్ద తొక్కిసలాట జరిగింది. మహిళలు తోసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పిఠాపురం టౌన్ ఎస్సై, దేవాదాయ శాఖ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.