హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో షాపులు, హోటళ్లకు జియో ఫెన్సింగ్

తిరుమలలోని షాపులు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థల వివరాలను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆయా సంస్థల లైసెన్సులు, ఇతర వివరాలను యాప్‌లో నమోదు చేసి, వాటి పర్యవేక్షణను సులభతరం చేయనుంది. సంస్థల డిజిటల్ మ్యాపింగ్, జియో ఫెన్సింగ్ ద్వారా నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.