హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీ సౌకర్యం లేక అనేక అవస్థలు

ASR: డుంబ్రిగుడ మండలంలోని తూటంగి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 300 మీటర్ల మేర ఉన్న ప్రధాన కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగునీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులకు స్పందించి సమస్యను పరిష్కరించాలంటున్నారు.