ASR: కించుమండల వారపు సంతలో సీతాఫలాలకు మంచి గిట్టుబాటు ధర లభించింది. హుకుంపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు సీతాఫలాలను సంతకు తీసుకొచ్చారు. పెద్ద సైజు కావిడి సీతాఫలాలు ప్రారంభంలో బుట్టలు రూ.1,500 వరకు విక్రయమయ్యాయి. సంత చివరి దశలో వ్యాపారులు కావిడికి రూ.1,200 వరకు కొనుగోలు చేశారు. ధర ఆశాజనకంగా ఉండటంతో సీతాఫలాల రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీతాఫలాలకు గిట్టుబాటు ధర


