హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గంజాయి మత్తులో యువకుల హల్‌చల్!

VSP: విశాఖ బీచ్ రోడ్‌లోని YMCA వద్ద గంజాయి మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. దారిన వెళ్లే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ముగ్గురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.