హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

15వ తేదీనే మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు

అనంతపురం: రాయదుర్గం పట్టణంలో వెలిసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలను ఈనెల 15వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు సవిత, వత్సల అశ్వత్, సావిత్రి పటేల్ పేర్కొన్నారు. గురువారం మీడియాకి ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున జాతర వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.