కడప: తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండలం పాపకి నగర్ కట్ట గ్రామం వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జి సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ..!


