హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రికి పీటీ వారంట్ అనుమతి

W.G: మద్యంరవాణా కేసులో నిందితుడైన వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పీటీ వారంటుకు న్యాయస్థానం అనుమతించింది. ఈడీ కేసులో అరెస్టు అయి హైదరాబాద్ చంచల్ గూడ కారాగారంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని, అందు కోసం పీటీ వారంట్ జారీ చేయాలని సిట్ అధికారులు ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.