హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేటలో గంజాయి కలకలం

PLD: చిలకలూరిపేట సుగాలి కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ పి.రమేష్ ఆదేశాలతో ఎస్సై వి.సోమేశ్వరరావు బృందం దాడి చేసి పవన్ కుమార్, మణిగోపాల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పట్టణంలో గంజాయి దందాను అరికడతామని సీఐ హెచ్చరించారు.