హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ మంజూరుకు డబ్బులు ఇవ్వొద్దు: ఎమ్మెల్యే

KRNL: ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల మంజూరుకు ఎవరూ డబ్బులు చెల్లించొద్దని పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు సూచించారు. పెన్షన్ ఇప్పిస్తామంటూ వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పేదల నుంచి నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్ధిదారులకు టీడీపీ శ్రేణులు సహకరించాలని కోరారు.