హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు నాణ్యమైన ఆహారంపై సూచనలు

ప్రకాశం: తాళ్లూరు(M)లో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ ప్రతాపరెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. శివరాంపురంలోని రేషన్ దుకాణం, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను పరిశీలించి లోపాలను వెంటనే సవరించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని అన్నారు. అనంతరం తాళ్లూరులోని కేజీబీవీ వసతి గృహాన్ని పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.