హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాటర్ బాటిల్ అధిక ధరపై రూ.7 లక్షల జరిమానా

కాకినాడ: దేవస్థానంలో రూ.18 ఎమ్మార్పీ ఉన్న వాటర్ బాటిల్‌ను రూ.25కు విక్రయించిన దుకాణదారుడికి జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.7 లక్షల జరిమానా విధించింది. పిఠాపురానికి చెందిన డి.వెంకటేశ్వరరావు ఫిర్యాదుపై విచారించిన కమిషన్.. ఫిర్యాదుదారునికి రూ.10 వేల పరిహారం, రూ.5 వేల కేసు ఖర్చులు, వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7 లక్షలు 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.