KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పంటల ధరలు నమోదయ్యాయి. పత్తి క్వింటాకు గరిష్ఠంగా రూ.9,919, వేరుశనగ రూ.9,710, ఆముదాలు రూ.7,076, పూల విత్తనాలు రూ.5,701 పలికాయి. పత్తి ధరలు వరుసగా రెండోరోజూ రూ.10 వేల దిగువకు చేరడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేరుశనగ గ్రేడింగ్ విధానాన్ని తొలగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పత్తి ధరల తగ్గుదలపై రైతుల ఆగ్రహం!


