NDL: బనగానపల్లె పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో ఇవాళ లక్ష్మీదేవి అనే మహిళ పేడ రంగు పసుపు నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో లక్ష్మీదేవి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
బనగానపల్లెలో మహిళ ఆత్మహత్య


