హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు, రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం

PPM: పాలకొండ నగర పంచాయతీ వెంకమ్మపేట రక్షిత పథకం పరిధిలో ఇవాళ, రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని కమిషనర్‌ పి.నూకరాజు ఓ ప్రకటనలో తెలిపారు. రక్షిత పథకం నుంచి భూగర్భంలోని పాత పైపులు తొలగించి నూతన పైపులు ఏర్పాటు చేయనున్నారు. గురువారం 1, 2, 11, 12, 17, 18, 19, 20 వార్డులకు నీటి సరఫరా ఉండదని, తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.