హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు వేంపల్లె సీఐ సూచనలు..!

KDP: శక్తి యాప్ మహిళలు, బాలికల రక్షణకు ఆపద సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని వేంపల్లె సీఐ నరసింహులు పేర్కొన్నారు. శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి వేంపల్లెలోని రాజీవ్ నగర్ కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణ కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ఉపయోగం, సేవలుపై అవగాహన కల్పించారు.